కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ పునరాగమనం చేయగలడా?

స్టీవ్ స్మిత్, ప్రపంచ క్రికెట్ మేటి ఆటగాళ్లలో ఒకరు. రెండు సంవత్సరాల క్రితం బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా నిషేధం ఎదుర్కొన్నాడు. ఏడాది నిషేధం తర్వాత మళ్ళీ జట్టులోకి వచ్చినప్పటి నుండి నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తున్నాడు. మర్చి 29వ తేదీతో అతని కెప్టెన్సీపై ఉన్న నిషేధం కూడా తొలగిపోయింది. ఇప్పటి ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫామ్ లో లేకపోవడంతో ఈ అంశం కూడా స్టీవ్ స్మిత్ కు కలిసివచ్చే విధంగా ఉంది. స్టీవ్ స్మిత్ నిషేధం ఎదుర్కొన్న కాలంలో జట్టులో అతను లేని లోటు స్పష్టంగా కనిపించింది. వరల్డ్ కప్ సమయానికి స్మిత్ జట్టులో ఉన్నా కూడా కంగారూలు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయారు. స్మిత్ కెప్టెన్సీపై నిషేధం తొలగిపోవడంతో మరోసారి ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించే బాధ్యతలు అతనికి అప్పగించవచ్చు అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అయితే కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు జరగాల్సిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు అన్నీ రద్దు కావడంతో, తిరిగి ప్రారంభం అయ్యాక టీం మానేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకోనుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *