మరోసారి దాతృత్వం చాటుకున్న తెలుగు సినీ పరిశ్రమ.

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ మన తెలుగు సినీ నటులు వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించిన సినీ నటులు, లాక్ డౌన్ సమయంలో సినీ కార్మికులు ఇబ్బంది పడకుండా ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సీసీసీ (కరోనా క్రైసిస్ చారిటీ) – మనకోసం అనే సంస్థను ఏర్పాటు చేసారు. ఈ సంస్థ ద్వారా ఇబ్బందుల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకోవడానికి సంకల్పించారు. ఈ సంస్థకు తెలుగు అగ్ర హీరోలు తమవంతు సహాయం చేశారు. ఈ సంస్థకు ఎవెరెవరు ఎంత విరాళాలు ఇచ్చారంటే…

చిరంజీవి – కోటి రూపాయలు.
నాగార్జున – కోటి రూపాయలు.
ఎన్టీఆర్ – 25 లక్షలు.
వెంకటేష్ మరియు సురేష్ బాబు – కోటి రూపాయలు.
మహేష్ బాబు – 25 లక్షలు.
రామ్ చరణ్ – 30 లక్షలు.
నాగ చైతన్య – 25 లక్షలు.
వరుణ్ తేజ్ – 20 లక్షలు.

వీరే కాకుండా శర్వానంద్ , కార్తికేయ, లావణ్య త్రిపాఠి, విశ్వక్సేన్, దిల్ రాజు, రవితేజ కూడా తమవంతు విరాళాలు సీసీసీ సంస్థకు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *